ఎగ్గొట్టేందుకే అమ్మ ఒడి వాయిదా!

ABN , First Publish Date - 2021-10-19T06:16:56+05:30 IST

అందరికీ అమ్మఒడి ఎగ్గొట్టేందుకే జూన్‌కు వాయి దా వేశారని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎ్‌సఎఫ్‌) అధికార ప్రతినిధి దొండపాటి విజయకుమార్‌ అన్నారు.

ఎగ్గొట్టేందుకే అమ్మ ఒడి వాయిదా!

టీఎన్‌ఎ్‌సఎఫ్‌ అధికార ప్రతినిధి దొండపాటి

విద్యాధరపురం : అందరికీ అమ్మఒడి ఎగ్గొట్టేందుకే జూన్‌కు వాయి దా వేశారని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎ్‌సఎఫ్‌) అధికార ప్రతినిధి దొండపాటి విజయకుమార్‌ అన్నారు. పథకాల పేరుతో ప్రజలను ఊరించిన సీఎం జగన్‌ ఇప్పుడు ఉసూరుమనిపిస్తున్నారన్నా రు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాతో పాఠశాలలకు విద్యార్థులు రాకపోయినా అమ్మఒడిని అమలు చేశామని గొప్పలు చెప్పుకుని, ఇప్పుడు 75శాతం విద్యార్థులు హాజరవుతుంటే జనవరిలో పథకాన్ని ఎందుకు నిర్వహించలేకపోతున్నారని నిలదీశారు.విద్యార్థులను కుదించేందుకు  వింత వింత ఆంక్షలు విధిస్తున్నారన్నారు. అమ్మఒడి వాయిదాతో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమవుతారని తెలిపారు.

Updated Date - 2021-10-19T06:16:56+05:30 IST