మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించాలి

ABN , First Publish Date - 2021-05-20T06:28:50+05:30 IST

ఏరియా వైద్యశాల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైరస్‌ భాదితులకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను బుధవారం ఆయన ప్రారం భించారు.

మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించాలి
కొవిడ్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రక్షణనిఽది

తిరువూరు, మే 19 : ఏరియా వైద్యశాల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వైరస్‌ భాదితులకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను బుధవారం ఆయన ప్రారం భించారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమవంతుల సహా య సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల వైరస్‌  బాధితులకు సత్వరం చికిత్స అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించి అవసరం మేరకు బెడ్లుకేటాయించాలని సూచించారు. ఎమ్మె ల్యే వెంట తహసీల్దార్‌ స్వర్గం నరసింహారావు,  డాక్టర్లు మూర్తి, గార్గేయ, గంగాధర్‌కుమార్‌, వైసీపీ నాయకులు కలకొండ రవికుమార్‌, యరమల రామచంద్రారెడ్డి, మో దుగు ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-20T06:28:50+05:30 IST