మామూళ్లు ఇవ్వలేదని వేతనాలు నిలిపివేత!

ABN , First Publish Date - 2021-11-28T05:57:38+05:30 IST

అంతర్గత ఆడిటర్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వలేదని దుర్గగుడి క్షురకులకు వేతనాలను నిలిపేసిన వైనం వెలుగులోకి వచ్చింది.

మామూళ్లు ఇవ్వలేదని వేతనాలు నిలిపివేత!

వన్‌టౌన్‌, నవంబరు 27 : అంతర్గత ఆడిటర్లకు నెలవారీ మామూళ్లు ఇవ్వలేదని దుర్గగుడి క్షురకులకు వేతనాలను నిలిపేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కేశఖండనశాలలో ముగ్గురు పర్మినెంట్‌ క్షురకులకు దేవస్థానం నేరుగా నెలకు రూ.40 వేలు చొప్పున వేతనం ఇస్తుంది. మిగిలిన 95మంది అవుట్‌ సోర్సింగ్‌ క్షురకులకు తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి వసూలు చేసే రూ.25 ఎలాంటి మినహాయింపు లేకుండా ఇస్తుంటారు. అయితే ఇటీవల భక్తుల రాక తగ్గటం, భక్తుల నుం చి కానుకలు స్వీకరించవద్దని ఆదేశాలు ఉండటంతో ఆడిటింగ్‌ విభాగానికి కొన్ని నెలలుగా మామూళ్లను ఇవ్వడం లేదు. అందువల్లే వేతనాలను పెండింగులో పెట్టారని పేరు చెప్పడానికి ఇష్టపడని దేవస్థానం సూపరింటెండెంట్‌ తెలిపారు.

Updated Date - 2021-11-28T05:57:38+05:30 IST