ఓటీఎస్‌ కాదది.. జగన్‌ జలగ

ABN , First Publish Date - 2021-12-30T06:42:04+05:30 IST

ఓటీఎస్‌ కాదది.. జగన్‌ జలగ

ఓటీఎస్‌ కాదది.. జగన్‌ జలగ

తెలుగు మహిళ అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర మండిపాటు 

విద్యాధరపురం, డిసెంబరు 29 : ఓటీఎస్‌ అనేది జగన్‌ రూపంలో పేదల రక్తం పీల్చే జలగ అని తెలుగు మహిళ అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఓటీఎస్‌ పేదల మెడకు ఉరితాడు అన్నారు. డబ్బు కట్టకపోతే పథకాలు, రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆదాయం ఎలా చేకూర్చుకోవాలో తెలియని దద్దమ్మ ప్రభుత్వం.. ఇలా పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీఎస్‌కు ఎవరూ సొమ్ము చెల్లించవద్దని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఉచితంగా నివాసాలు ఇస్తామన్నారు. తెలుగు మహిళ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ ఓటీఎస్‌కు డబ్బు కట్టాల్సిన అవసరమే లేదన్నారు. బలవంతపు వసూళ్లు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు బొప్పన నీరజ, నళిని పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-30T06:42:04+05:30 IST