సిగ్నల్స్‌ అందక విమానం చక్కర్లు.. సురక్షితంగా ల్యాండింగ్‌

ABN , First Publish Date - 2021-10-07T06:35:39+05:30 IST

సిగ్నల్స్‌ అందక విమానం చక్కర్లు.. సురక్షితంగా ల్యాండింగ్‌

సిగ్నల్స్‌ అందక విమానం చక్కర్లు.. సురక్షితంగా ల్యాండింగ్‌

గన్నవరం, అక్టోబరు 6: గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన అంతర్జాతీయ విమానం ప్రతికూల వాతావరణంతో సిగ్నల్స్‌ అందకపోవడంతో మచిలీపట్నంలో పది రౌండ్లు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సిగ్నల్స్‌ అందడంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. కౌలాలంపూర్‌ నుంచి 165 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం బుధవారం సాయంత్రం ఇక్కడకు చేరుకుంది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 5.20కు వచ్చి 5.50కు బయలుదేరాలి. వాతావరణం అనుకూలించకపోవటంతో 5.50 గంటలకు ల్యాండ్‌ అయింది. 6.30 గంటలకు హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లింది. గన్నవరంలో 61 మంది ప్రయాణికులు దిగారు. ప్రతి బుధవారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కౌలాలంపూర్‌లో బయలుదేరి గన్నవరం మీదుగా హైదరాబాద్‌ వెళుతుంది. 

Updated Date - 2021-10-07T06:35:39+05:30 IST