బాలికలపై అసభ్యకర ప్రవర్తన.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-12-07T06:35:07+05:30 IST

బాలికలపై అసభ్యకర ప్రవర్తన.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

బాలికలపై అసభ్యకర ప్రవర్తన.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

జగ్గయ్యపేట, డిసెంబరు 6: బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జగ్గయ్యపేట బాలుర ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పి.రామును జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా సస్పెండ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నం పాఠశాలలో కొందరు బాలికలపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించటంతో వారు ప్రధానోపాధ్యాయురాలికి, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. బాలికల బంధువులు ఒక్కసారిగా పాఠశాలకు వచ్చి గణిత ఉపాధ్యాయుడిని నిలదీశారు. సమాచారం అందుకున్న నందిగామ డీవైఈవో వేణుగోపాలరావు హూటాహుటిన జగ్గయ్యపేట వచ్చి విచారించారు.  బాలికలను విచారించి ఉపాధ్యాయుడిపై వెంటనే డీఈవో తాహెరా సుల్తానాకు నివేదిక అందజేశారు. ఆమె వెంటనే స్పందించి ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను వెంటనే అందించాలని హెచ్‌ఎంకు పంపినట్టు డీ వైఈవో తెలిపారు. 

Updated Date - 2021-12-07T06:35:07+05:30 IST