పార్టీ పదవులకు నగరంలో అర్హులే లేరా?

ABN , First Publish Date - 2021-10-31T06:33:20+05:30 IST

తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పదవికి నగరంలో అర్హులే లేరా అని మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణారావు ప్రశ్నించారు.

పార్టీ పదవులకు నగరంలో అర్హులే లేరా?

అధికార ప్రతినిధి పదవి స్వీకరించను.. ప్రాణం ఉన్నంత వరకు పార్టీ వీడను

టీడీపీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ ఎరుబోతు రమణారావు

అజిత్‌సింగ్‌నగర్‌, అక్టోబరు 30: తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పదవికి నగరంలో అర్హులే లేరా అని మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణారావు ప్రశ్నించారు. అజిత్‌సింగ్‌నగర్‌ సెంట్రల్‌ టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని శ్రీనివా్‌సపై రమణారావు పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ముఖ్య నేతలు బుద్దా వెంకన్న, నాగూల్‌మీరా, పట్టాభి, వర్ల రామయ్య, తంగిరాల సౌమ్య వంటి వారు తనను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఇచ్చిన సిఫార్సు లేఖను అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నతో పాటు ఎంపీ కేశినేని నాని, అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌కు అందజేసినప్పుడు అన్ని అర్హతలు ఉన్నాయని, తప్పకుండా నియ మిస్తామని చెప్పి, నేడు అన్యాయం చేయడం ఎంతవర కు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ స్థాపించినప్ప టి నుంచి పార్టీలో కొనసాగుతూ ఐదు సార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసి, పార్టీ కష్ట కాలంలోను టీడీపీ ఫ్లోర్‌ లీ డర్‌గా పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశానన్నా రు. పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని చెప్పి తిరువూరు నేతను నియమించడంపై అభ్యంత రం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన నేత కావడంతో ప్రధాన కార్యదర్శి నగరానికి కేటాయిస్తే బాగుండేదన్నారు. మంత్రి కొడాలి నాని అధినేత చంద్రబాబు, లోకే్‌షపై ఇష్టం వచ్చినట్లు మా ట్లాడుతుంటే పట్టించుకోని నేతల కార్యాలయాల్లో గుమస్తాలుగా పనిచేసే వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారన్నారు. అధికార ప్రతినిధి పదవిని స్వీకరించనని, ప్రా ణం ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్ప ష్టం చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడు, లోకే్‌షను అరెస్ట్‌ చేసినప్పుడు కంటికి కనబడని నేతలు నగరంలో పెత్తనం చెలాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో 57వ డివిజన్‌ నేతలు గుప్తా, నాగూల్‌మీరా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T06:33:20+05:30 IST