టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-07-12T06:14:01+05:30 IST

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌

పెనమలూరు, జూలై 11 : టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పోరంకిలోని టీడీపీ కార్యాలయంలో తాడిగడప మున్సిపాలిటీలోని 7, 8, 9, 10, 11, 12, డివిజన్ల కమిటీ సభ్యుల నియామకం జరిగింది. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ డివిజన్‌ స్థాయిలో కృషి చేయాలన్నారు. 7వ డివిజన్‌ సతీష్‌, 8 దోనేపూడి ప్రవీణ్‌, 9 కావటి రవి, 10 సరిహద్దు కోటేశ్వరరావు, 11 తుమ్మల రాం కుమార్‌, 12 వేముల గగారిన్‌లను అధ్యక్షులుగా నియమించారు. ఈ కార్యక్ర మంలో మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, మేడసాని రత్న కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T06:14:01+05:30 IST