వార్డుల డీలిమిటేషన్‌ను ఆపాలి

ABN , First Publish Date - 2021-02-05T06:25:26+05:30 IST

వార్డుల డీలిమిటేషన్‌ను ఆపాలి

వార్డుల డీలిమిటేషన్‌ను ఆపాలి

గుడివాడ కమిషనర్‌కు టీడీపీ వినతి

గుడివాడటౌన్‌, ఫిబ్రవరి 4: పురపాలక సంఘంలో వార్డుల డీలిమిటేషన్‌ హేతుబద్ధంగా లేదని టీడీపీ సీనియర్‌ నాయకుడు దింట్యాల రాంబాబు ఆరోపించారు. దీనిపై గురువారం టీడీపీ నాయకులతో కలసి మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌కు అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన అందజేశారు. వలివర్తిపాడు, లింగవరం, బిళ్లపాడు, బొమ్ములూరు, మల్లాయిపాలెం, భూషణగుళ్ల పంచాయతీలను పట్టణంలో విలీనం చేస్తూ చేసిన వార్డుల విభజనపై తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. ప్రక్రియను సస్పెండ్‌ చేస్తూ, స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. డిసెంబరు 31, 2020న ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీతో వార్డుల విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్నారు. మళ్లీ దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. ఆర్డినెన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 11న హైకోర్టు తుది తీర్పు వస్తుందని, మున్సిపల్‌ వార్డుల పునర్విభజనను నిలుపుదల చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ముళ్లపూడి రమేష్‌, పొట్లూరి కృష్ణారావు, శొంఠి రామకృష్ణ, ఆకునూరి ఏకాంబరం  పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-05T06:25:26+05:30 IST