జగన్ బాగా నటిస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-01-20T14:14:39+05:30 IST

అశోక్ గజపతిరాజు ఇచ్చిన విరాళాన్ని వెనక్కి పంపడం భక్తుల్ని అవమానించడమే అని

జగన్ బాగా నటిస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్సీ

అమరావతి: అశోక్ గజపతిరాజు  ఇచ్చిన విరాళాన్ని వెనక్కి పంపడం భక్తుల్ని అవమానించడమే అని... భక్తులు ఇచ్చిన విరాళాలను తిరస్కరించడం దేశంలో ఇదే ప్రథమమని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిందితులను పట్టుకోవడం చేతకాని వెల్లంపల్లి పదవి కాపాడుకోవడానికి జగన్ కాళ్ళు పట్టుకుంటున్నారని విమర్శించారు. పవిత్రమైన దేవాదాయశాఖను తన వ్యహారాలశైలితో అపవిత్రం చేస్తున్నారన్నారు. హిందూ మతాన్ని ఉద్దరిస్తున్నట్లు  ప్రజల ముందు జగన్ బాగా నటిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నిందితులను పట్టుకోవడం చేతకాని ముఖ్యమంత్రి, మంత్రి  ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. 150 ఆలయాలపై దాడులు జరిగితే  విచారణకు ఆదేశించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం నిగ్గు తేల్చాల్సిన పోలీసుల కంటే ముందే సీఎం, మంత్రులు ప్రతిపక్షంపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఇకనైనా తన డ్రామాలు కట్టిపెట్టి  అన్ని మతాల గౌరవాన్ని కాపాడాలని సత్యనారాయణ హితవు పలికారు. 

Updated Date - 2021-01-20T14:14:39+05:30 IST