మచిలీపట్నం పార్లమెంట్‌ టీడీపీ కమిటీ ఇదే..

ABN , First Publish Date - 2021-07-09T04:42:36+05:30 IST

మచిలీపట్నం పార్లమెంట్‌ టీడీపీ కమిటీ ఇదే..

మచిలీపట్నం పార్లమెంట్‌ టీడీపీ కమిటీ ఇదే..

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు గురువారం ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కొనకళ్ల నారాయణరావు, ఉపాధ్యక్షులుగా వెలగపూడి శంకరబాబు (పెనుమలూరు), అన్నం హరిరామకృష్ణ (పెడన),  నన్నపనేని వీరేంద్ర (పామర్రు), సూరపనేని వెంకట సత్యనారాయణ (పామర్రు),  మండవల్లి వెంకటరత్నం (అవనిగడ్డ), శ్రీదండు సుబ్రహ్మణ్యరాజు (గన్నవరం)ను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా పెనుమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను నియమించారు. ఆఫీసు కార్యదర్శిగా మచిలీపట్నానికి చెందిన బత్తిన మురళీకృష్ణదాసును నియమించారు.

అధికార ప్రతినిధులు 

మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధులుగా ఆళ్ల గోపాలకృష్ణ (గన్నవరం), శొంఠి రామకృష్ణ (గుడివాడ),  మందపాక శంకరబాబు (పామర్రు),కొల్లూరి వెంకటేశ్వరరావు (అవనిగడ్డ), ఒడుగు తులసీరావు (పెడన), కొండా ప్రవీణ్‌ (పెనుమలూరు), తలారి సోమశేఖర్‌ , లంకే శేషగిరి (మచిలీపట్నం)ను నియమించారు. 

కార్యనిర్వాహక కార్యదర్శులు

మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఉమ్మడిశెట్టి శ్రీరాములు (పెడన), మరకాని పరబ్రహ్మం (మచిలీపట్నం), లకనం నాగాంజనేయులు (అవనిగడ్డ), అట్లూరి రామచంద్రపసాద్‌ (గుడివాడ), చెన్నుబోయిన శివయ్య (గన్నవరం), కూనసాని వెంకటరత్నారావు (పెడన), ఆన్నే ధనరామకోటేశ్వరరావు (పెనుమలూరు), దాలిపర్తి ప్రసాద్‌ (పామర్రు)ను నియమించారు. 

కార్యదర్శులు

మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ కార్యదర్శులుగా గొరిపర్తి సుబ్బారావు, ఐనపూడి భానుప్రకాష్‌ (అవనిగడ్డ), రెహమాన్‌ బేగ్‌, సీహెచ్‌ఎస్‌వీ ప్రవీణ్‌కుమార్‌ (పెడన), మేడేపల్లి జ్ఞానేసు (గుడివాడ), కొండేటి వెంకటేశ్వరరావు (గన్నవరం), యలమంచిలి సతీష్‌ (గుడివాడ), దోవా వేణు, బీమవరపు అంజిరెడి,్డ వంపుగడవల ఫ్రాన్సిస్‌ (పామర్రు)ను నియమించారు. మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ కోశాధికారిగా మోటమర్రి వెంకట బాబాప్రసాద్‌ (మచిలీపట్నం), మీడియా కో-ఆర్డినేటరుగా పీవీ ఫణికుమార్‌ (మచిలీపట్నం), కో-ఆర్డినేటరుగా ఉప్పలపాటి ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు. 

Updated Date - 2021-07-09T04:42:36+05:30 IST