రాష్ట్రానికి మేలు చేయడంలో ఎంపీలందరూ ఫెయిల్: యనమల
ABN , First Publish Date - 2021-03-24T16:35:55+05:30 IST
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్, వైసీపీ నేతలు స్పందించకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్, వైసీపీ నేతలు స్పందించకపోవడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రత్యేక హోదా ఇవ్వలేం, ప్రత్యేక ప్యాకేజీ అడగడం లేదన్నారని చెప్పారని.. అయితే కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రజల్ని మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి మేలు చేయడంలో ఎంపీలందరూ ఫెయిల్ అయ్యారని... వారందరూ రాజీనామాలు చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.