పోలీసులే అలాంటి పనులు చేస్తుంటే ఊరుకున్నారా డీజీపీ గారూ...: వర్ల

ABN , First Publish Date - 2021-02-01T16:31:49+05:30 IST

ఎస్ఈసీ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అధికారపార్టీ ఆగడాలు ఆగడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు.

పోలీసులే అలాంటి పనులు చేస్తుంటే ఊరుకున్నారా డీజీపీ గారూ...: వర్ల

విజయవాడ: ఎస్ఈసీ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అధికారపార్టీ ఆగడాలు ఆగడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తరువాత తాము అధికారులను తిరిగి సీట్లో కూచోపెడతాం అంటున్నారని మండిపడ్డారు. నిమ్మాడలో వైసీపీ నేతల చర్యలపై పోలీసులు చోద్యం చూస్తున్నారని...ఇటువంటి వాతావరణంలో ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. నిమ్మాడ ఘటన జరిగినప్పుడు స్ధానిక సీఐ నీలయ్య అక్కడే ఉన్నారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే సదరు సీఐని, టెక్కలి డీఎస్పీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘అచ్చెన్నాయుడును వాడు వీడు అని సంబోధించాడట సీఐ... డీఎస్పీ కూడా సీఐ చర్యలపై నవ్వుతున్నాడట. డీజీపీగా మీరే పోలీసులు అలాంటి పనులు చేస్తుంటే ఊరుకున్నారా సవాంగ్ గారూ. డీజీపీ సవాంగ్ గారు పోలీసులు విధులు సక్రమంగా చేసేలా ఆదేశాలివ్వాలి. పోలీసులు ఇదే విధంగా పనిచేస్తే ఎన్నికలు సజావుగా జరగవు’’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. 


ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.. గత ఎన్నికలలో ఎంపీటీసీ, జట్పీటీసీలలో 80% ఏకగ్రీవం అయిందని చెప్పారు.  ఏకగ్రీవం అయిన చోట జరిగిన దుర్మార్గాలు ఎస్ఈసీ దృష్టికి తెచ్చామని, ఆయా ప్రాంతాలలో ప్రత్యేక దళాలను పెట్టాలని కోరామని అన్నారు. ఆన్లైన్ నామినేషన్ సదుపాయం ఇస్తే, ఈ అవాంతరాలన్నీ తొలగిపోతాయని ఎస్ఈసీకి తెలిపామని అశోక్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-01T16:31:49+05:30 IST