నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులివ్వడం దారుణం: చినరాజప్ప

ABN , First Publish Date - 2021-10-19T18:16:40+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులివ్వడం దారుణం: చినరాజప్ప

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నిన్న మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు ఆనందబాబు ఇంటికి రావడంపై రాజప్ప మండిపడ్డారు. పోలీసులు నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు... ఆనంద బాబుకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం నర్సీపట్నం నుంచి గుంటూరు ఆగమేఘాలమీద వచ్చారని రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు, దళితులపై దాడులు జరిగితే మాత్రం పోలీసులు స్పందించరని రాజప్ప తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-19T18:16:40+05:30 IST