డీజీపీ కనుసన్నల్లోనే టీడీపీ నేతలపై దాడులు: Nakka Anand
ABN , First Publish Date - 2021-10-20T17:25:57+05:30 IST
ఏపీలో ప్రజలకు బ్రతికే హక్కు లేదని...ప్రజల ప్రాధమిక హక్కులను హరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

గుంటూరు: ఏపీలో ప్రజలకు బ్రతికే హక్కు లేదని...ప్రజల ప్రాధమిక హక్కులను హరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర డీజీపీ కనుసన్నల్లోనే టీడీపీ నేతలపై దాడులు జరిగాయని ఆరోపించారు. పోలీసుల సహకారంతోనే టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై డీజీపీ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. గుంటూరులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ జెండాలు తగలబెట్టారన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆనంద బాబు హెచ్చరించారు.