ప్రజాధనం దోపిడీకే నాడు-నేడు: Jawahar

ABN , First Publish Date - 2021-08-21T18:56:44+05:30 IST

ప్రజాధనం దోపిడీకే నాడు-నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు.

ప్రజాధనం దోపిడీకే నాడు-నేడు: Jawahar

విజయవాడ: ప్రజాధనం దోపిడీకే నాడు-నేడు కార్యక్రమానికి తీసుకువచ్చారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ విమర్శలు గుప్పించారు. నాడు-నేడు పనులు పైన పటారం.. లోన లొటారంలా ఉందన్నారు. నాడు - నేడు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోపిడీకి నాడు-నేడు పనులను అక్షయ పాత్రగా మార్చుకున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా విద్యావ్యవస్థను జగన్‌రెడ్డి సర్వనాశనం చేశారన్నారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారని తెలిపారు. వైసీపీ నేతల దోపిడీకి అధికారులు బలవుతున్నారని కేఎస్ జవహర్ అన్నారు. 

Updated Date - 2021-08-21T18:56:44+05:30 IST