ఇది ప్రజాస్వామ్య విజయం: గోరంట్ల

ABN , First Publish Date - 2021-05-21T17:08:25+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పుపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు.

ఇది ప్రజాస్వామ్య విజయం: గోరంట్ల

అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పుపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘సుప్రీం కోర్టు మార్గదర్శకాలకి అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలి అని సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్ట్. ప్రజాస్వామ్య విజయం ఇది. ప్రభుత్వం ఇప్పటికైనా పద్దతి మార్చుకుని చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలి’’ అంటూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్వీట్ చేశారు.Updated Date - 2021-05-21T17:08:25+05:30 IST