అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా?: Devineni

ABN , First Publish Date - 2021-10-19T16:05:44+05:30 IST

ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఒక ఏడాది తప్పించడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా?: Devineni

అమరావతి: ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఒక ఏడాది తప్పించడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ....‘‘ఈ ఏడాది అమ్మఒడి ఎగ్గొట్టిన సర్కార్. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. ఎన్నికల ముందు అందరికీ అని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఒక్కరికేనని మోసం చేశారు. విదేశీ విద్య, స్కాలర్షిప్‌లకు మంగళంపాడారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతికి విద్యార్థుల భవిష్యత్తు బలికావాలా? చెప్పండి’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-10-19T16:05:44+05:30 IST