పీఆర్ మోహన్ మృతి బాధాకరం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-07-12T14:28:03+05:30 IST

టీడీపీ సీనియర్ పీఆర్‌ మోహన్‌ మృతి బాధాకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

పీఆర్ మోహన్ మృతి బాధాకరం: చంద్రబాబు

అమరావతి: టీడీపీ సీనియర్ పీఆర్‌ మోహన్‌ మృతి బాధాకరమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మోహన్ గుండెపోటుతో మృతి చెందారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి మోహన్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. శాప్ చైర్మన్‌గా మోహన్‌ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశారని తెలిపారు. టీడీపీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని అన్నారు. మోహన్ కుటుంబసభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-07-12T14:28:03+05:30 IST