జగన్ మంచి నటుడు: Alapati
ABN , First Publish Date - 2021-10-21T19:24:41+05:30 IST
ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రజలంతా గమనిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

అమరావతి: ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రజలంతా గమనిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి మంచి నటుడని ప్రజలకు అర్ధమైందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పన్నుల మోతతో ప్రజల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. ఏపీలో గంజాయి ఏరులై పారుతోందన్నారు. పక్క రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడినా మూలాలు ఏపీలోనే అని అన్నారు. నారా లోకేష్ ఏం చేశారని కేసు పెట్టారని ప్రశ్నించారు. మాస్కులు అడిగిన సుధాకర్‌ను హత్య చేశారని... తమ అరాచకాలను ప్రశ్నించిన జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేశారని అన్నారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారని మండిపడ్డారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారన్నారు. తమ తాటాకు చప్పుళ్లకు భయపడమని స్పష్టం చేశారు. ప్రభుత్వ అరాచక విధానాలపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఆలపాటి రాజేంద్రప్రాసద్ అన్నారు.