పట్టా కావాలా.. మా ఇంటికి రండి..

ABN , First Publish Date - 2021-01-12T06:27:35+05:30 IST

పట్టా కావాలా.. మా ఇంటికి రండి..

పట్టా కావాలా..  మా ఇంటికి రండి..

కంకిపాడు, జనవరి 11 : కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామంటాడు పార్టీ నేత.. అయితే  మండలంలోని ఈడుపుగల్లు పరిధిలోని ఓ వైసీపీ నేత తీరు మరోలా ఉంది. ఓ ఇళ్ల పట్టాలు కావాలంటే ఇంటికి రా వాలంటూ హుకుం జారీ చేశారు. ఇంటికి వస్తే.. పార్టీకి ఎందుకు ఓటు వేయలేదు..? ఎందుకు వేయరు..? అం టూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇకనైనా పార్టీకి ఓటు వేయాలి, అంటూ పార్టీ మార్పిడికి ప్రయత్నిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇంటి పట్టాలు ఉండవంటూ భయపెడుతున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-01-12T06:27:35+05:30 IST