LIVE: Chandrababu నిరసన దీక్ష ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-21T14:02:10+05:30 IST
టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష గురువారం ఉదయం ప్రారంభమైంది.

అమరావతి: టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష గురువారం ఉదయం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో దీక్ష చేపట్టారు. పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్ష కొనసాగనుంది. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేశారు. దీక్షకు మద్దతుగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే టీడీపీకి గుంటూరు అర్బన్ పోలీసుల నోటీసులు అందజేశారు. నేతలు, కార్యకర్తలను పార్టీ కార్యాలయం వరకు పోలీసులు అనిమతిస్తారా..? అనేది అనుమానంగా ఉంది.
గవర్నర్‌ను కలవనున్న నేతలు
ఇదిలా ఉంటే.. గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్‌ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలవనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తదితరులు గవర్నర్ వద్దకు వెళ్తున్నారు.