AP: చంద్రబాబు కాన్వాయ్ మార్గాన్ని మార్చిన పోలీసులు
ABN , First Publish Date - 2021-10-21T14:51:10+05:30 IST
పార్టీ కార్యాలయంలపై దాడికి నిరసనగా చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ మార్గాన్ని పోలీసులు మార్చారు.

అమరావతి: పార్టీ కార్యాలయంలపై దాడికి నిరసనగా చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ మార్గాన్ని పోలీసులు మార్చారు. అదే సమయంలో సీఎం బయల్దేరడంతో మార్గాన్ని మళ్లించారు. తాడేపల్లి వైపు కూడా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వాయ్‌ను మళ్లించారు. రూట్ మారడంతో దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా చంద్రబాబు దీక్షా స్థలికి చేరుకున్నారు.