టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-02-01T06:48:36+05:30 IST

వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడి చేసి గాయపర్చారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు వస్తే తమను పట్టించుకోలేదని పలువురు టీడీపీ నేతలు అదివారం కొత్తపేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యం

పార్టీ మారినందుకే అధికార పార్టీ కార్యకర్తల దాడి

కులవివాదం అని చెబుతున్న పోలీసులు 

చిట్టినగర్‌, జనవరి 31: వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడి చేసి గాయపర్చారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు వస్తే తమను పట్టించుకోలేదని పలువురు టీడీపీ నేతలు అదివారం కొత్తపేట పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని టీడీపీ 49వ డివిజన్‌ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ ఆరోపించారు. తమ ముందే అధికార పార్టీ నేతలతో మాట్లాడిన స్టేషన్‌ ఎస్సై తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయవాగు చెం దిన సంపత్‌ ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు. గతంలో సంపత్‌కు వైసీపీకి చెందిన పలువురు యువకులకు మధ్య వివాదం జరిగింది. ఆదివారం రాత్రి శ్రీను అనే వ్యక్తి సంపత్‌కు ఫోన్‌ చేసి మాట్లాడుకుందని పిలిచి దాడి చేశారని బాధితుడు చెబుతున్నాడు. కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇటీవల టీడీపీలో చేరిన తమ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారని, ఆ ప్రాంతంలో వైసీపీ డివిజన్‌ అధ్యక్షుడు తమ కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాని చెబితే దాడి చేసిన వారి వదిలి తమ కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకోచ్చారని రమణ ఆరోపించారు. పోలీసులు మాత్రం కుల వివాదం అని చెబుతున్నారు. 

Updated Date - 2021-02-01T06:48:36+05:30 IST