ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం

ABN , First Publish Date - 2021-03-22T05:42:18+05:30 IST

ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం

ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం

గన్నవరం, మార్చి 21: అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోకపోవడం భాధాకరమని బహుజన జైభీమ్‌ పోరాట సమితి(బీజేపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు జీవీ రత్నం ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఐఏఎస్‌పై కుల అహంకారంతో వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. అందరి మన్ననలు పొందుతూ సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్న కలెక్టర్‌పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆచారాల పేరుతో జరిగే నేర ప్రభావిత చర్యలను కలెక్టర్‌ గంధం చంద్రుడు అదుపు చేస్తే, రౌడీయిజంతో ఆ గ్రామాల మధ్య వివాదాలు జరిగే చర్యలకు సహకరిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడం దుర్మార్గమన్నారు. దళిత ఐఏఎస్‌ అధికారిపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడంతో దళితులపై ప్రభుత్వం ఎలాంటి ప్రేమ చూపుతుందో అర్థమవుతోందన్నారు. తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రత్నకుమార్‌ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-03-22T05:42:18+05:30 IST