స్వచ్ఛ సంకల్పంపై ర్యాలీలు

ABN , First Publish Date - 2021-08-21T05:53:22+05:30 IST

స్వచ్ఛ సంకల్పంపై ర్యాలీలు

స్వచ్ఛ సంకల్పంపై ర్యాలీలు
గండిగుంటలో స్వచ్ఛ సంకల్పం ర్యాలీ

గండిగుంట(ఉయ్యూరు), ఆగస్టు 20 : గండిగుంట పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛ సంకల్పంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ గెత్తం అనుపమ ముఖ్య  అతిథిగా పాల్గొని జగనన్న స్వచ్ఛ సంకల్పం లక్ష్యాన్ని వివరించారు.  గ్రామాన్ని పరిశుభ్రంగా ఉచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.  కార్యదర్శి వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకుడు గెత్తం విజయకుమార్‌ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. 

ఫ ముదునూరులో సర్పంచ్‌ మొవ్వ వెంకటనాగలక్ష్మి ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ ముదునూరుకు సహకరించాలని తడి, పొడి చెత్త వేర్వేరుగా సిబ్బందికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

తేలప్రోలులో..

  ఉంగుటూరు : గ్రామాల్లో ప్రజలందరూ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేందుకు ప్రభుత్వం జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఈవోపీఆర్డీ, తేలప్రోలు పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి విజయకుమార్‌ అన్నారు. శుక్రవారం  తేలప్రోలు-ఉయ్యూ రు ప్రధాన రహదారి పక్కన చెత్తను తొలగించి, బ్లీచింగ్‌ చల్లించి, ఆ ప్రదేశంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది గ్రామంలో నిత్యం పారిశుధ్య చర్యలు చేపడుతున్నా, వ్యాపారదుకాణాల యజమానులు, హోటళ్ల నిర్వాహకులు, పండ్లవ్యాపారుల్లో మార్పు రావడంలేదన్నారు. రోడ్డు పక్కన చెత్తను డంపింగ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం గ్రామంలో కరోనా కేసులతో పాటు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని, గ్రామాన్ని చెత్తరహితంగా మార్చేందుకు గ్రామస్ధులతో పాటు, వ్యాపారులు కూడా సహకరించాలని ఆయన కోరారు. సర్పంచ్‌ లాం దిబోరా, ఉప సర్పంచ్‌ వింతా ఆదినారాయణరెడ్డి, ఐటిఐ ప్రిన్సిపాల్‌ టి.రాజేంద్రనాథ్‌ రెడ్డి, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T05:53:22+05:30 IST