అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-24T05:53:15+05:30 IST

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

జి.కొండూరు, మార్చి 23: అప్పుల బాధ తాళలేక చెర్వుమాధవరం పొలాల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కంకిపాడుకు చెందిన కొల్లిపరి శ్రీనివాసరావు (34) పన్నెండేళ్ల క్రితం కంకిపాడు నుంచి గడ్డమణుగు గ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే అద్దెకుంటూ పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యవసాయంలో నష్టపోవడంతో తనకు తెలిసిన మెకానిక్‌ పని చేసేందుకు జి.కొండూరులో ఓషాపు అద్దెకు తీసుకున్నాడు. అందుకోసం మళ్లీ అప్పు చేశాడు. అటు వ్యవసాయం కోసం చేసిన బాకీలు, ఇటు షాపు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఆర్‌.ధర్మరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుడి తండ్రి సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-24T05:53:15+05:30 IST