సుబ్రహ్మణ్యేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.52.57లక్షలు
ABN , First Publish Date - 2021-10-28T06:21:00+05:30 IST
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం దేవదాయ ధర్మాదాయశాఖ పర్యవేక్షణలో లెక్కించగా రూ.52.57 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో జి.వి.డిఎన్.లీలాకుమార్ తెలిపారు.

మోపిదేవి, అక్టోబరు 27 : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం దేవదాయ ధర్మాదాయశాఖ పర్యవేక్షణలో లెక్కించగా రూ.52.57 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో జి.వి.డిఎన్.లీలాకుమార్ తెలిపారు. 70 రోజులకు రూ,52,57, 601 నగదు, బంగారం 50 గ్రాముల బంగారం, 2 కేజీల 956 గ్రాముల వెండి, 43 అమెరికన్ డాటర్లు భక్తులు సమర్పించారన్నారు. దేవదాయశాఖ మచిలీ పట్నం ఇన్స్పెక్టర్ వి.సుధాకర్, ఎస్టేట్ దేవాలయాల ఉద్యోగులు భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు.