జ్యోతిమహల్‌ సెంటర్‌లో సబ్‌వే ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-03-22T05:55:23+05:30 IST

జ్యోతిమహల్‌ సెంటర్‌లో సబ్‌వే ఏర్పాటు చేయాలి

జ్యోతిమహల్‌ సెంటర్‌లో సబ్‌వే ఏర్పాటు చేయాలి
సమస్యలపై స్థానికులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

 రామలింగేశ్వరనగర్‌, మార్చి 21 : బెంజిసర్కిల్‌ వద్ద రెండో ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా ప్రగతినగర్‌, శ్రీరామ్‌నగర్‌, మొహిద్దీన్‌ ఎస్టేట్‌, బృందావన్‌ కాలనీ, ఫకీరుగూడెం ఏరియా  నివాసితులు ఇబ్బంది పడకుండా జ్యోతిమహల్‌ సెంటర్‌ నుంచి సబ్‌వే ఏర్పాటు చేయాలని స్ధానికులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కోరారు. ఆదివారం 9వ డివిజన్‌లో  ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సంద ర్భంగా స్ధానికులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మూడు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వాటి నిర్మాణం చేపట్టాలని కోరారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిమహల్‌ సెంటర్‌ వద్ద సబ్‌వే విషయంపై నేషనల్‌ హైవే అధికారులతో మాట్లాడతానని, మిగతా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ చెన్నుపాటి క్రాంతిశ్రీ, కాలనీ అధ్యక్షులు ఆర్య, సెక్రటరీ సీతారామయ్య, చెన్నుపాటి గాంధీ, ఆయా కాలనీ వాసులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం

లబ్బీపేట : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అన్నారు. 19వ డివిజన్‌లో టీడీపీ నాయకులు భాగం సాయిప్రసాద్‌, దున్నా ఏసురత్నం ఆధ్వర్యంలో సిద్ధార్థ మహిళ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ పదేళ్లుగా ఈ ప్రాంతంలో టీడీపీ ఆధ్యర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది తెలుగుదేశం పార్టీ  కార్యకర్తల, నాయకుల సేవాగుణానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:55:23+05:30 IST