కోచింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-10-19T06:18:13+05:30 IST

పెనమలూరు మండలం గోసాల గ్రా మంలో అనుమతులు లేకుండా జూనియర్‌ కళాశాల నిర్వహిస్తున్న గోశాల లైట్స్‌ కోచింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.చరణ్‌ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.

కోచింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకోండి

పటమట, అక్టోబరు 18 : పెనమలూరు మండలం గోసాల గ్రా మంలో అనుమతులు లేకుండా జూనియర్‌ కళాశాల నిర్వహిస్తున్న గోశాల లైట్స్‌ కోచింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమైక్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.చరణ్‌ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం పటమటలోని ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్యాలయంలో ఆయన్ను కలిసి మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు లేకుండా సదరు కోచింగ్‌ సెంట ర్‌ వారు ఇంటర్‌ విద్యార్థులను మోసం చేస్తున్నారని, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. సదరు కాలేజీలో చదివే వి ద్యార్థుల ఫీజులను వెనక్కి ఇచ్చి వారిని వేరే కళాశాలలో చేర్చేలా చర్య లు తీసుకోవాలని నగరాధ్యక్షుడు దినేష్‌, రాజేష్‌, సంజయ్‌ కోరారు.

Updated Date - 2021-10-19T06:18:13+05:30 IST