వస్త్రాలపై పెంచిన జీఎ్‌సటీని తగ్గించాలి

ABN , First Publish Date - 2021-12-31T06:02:31+05:30 IST

వస్ర్తాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎ్‌సటీని తగ్గించాలని కోరుతూ గురువారం వన్‌టౌన్‌లోని కృష్ణవేణి హోల్‌సేల్‌ క్లాత్‌ మార్కెట్‌లో వ్యాపారులు నిరసన ప్రదర్శన చేశారు.

వస్త్రాలపై పెంచిన జీఎ్‌సటీని తగ్గించాలి

కృష్ఱవేణి హోల్‌సేల్‌ వస్త్ర మార్కెట్‌లో వ్యాపారుల నిరసన 

వన్‌టౌన్‌, డిసెంబరు 30 : వస్ర్తాలపై కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎ్‌సటీని తగ్గించాలని కోరుతూ గురువారం వన్‌టౌన్‌లోని కృష్ణవేణి హోల్‌సేల్‌ క్లాత్‌ మార్కెట్‌లో వ్యాపారులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఏపీ టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి బచ్చు వరప్రసాద్‌తో పాటు పలువురు ఫెడరేషన్‌ నేతలు నిరసనలో పాల్గొన్నారు. జనవరి 1నుంచి వస్త్రాలపై 5శాతం ఉన్న జీఎ్‌సటీ 12శాతానికి పెరుగుతుందని, ఇది వస్త్ర వ్యాపారులతోపాటు అన్నివర్గాల ప్రజలపై భారం పడుతుందన్నారు. ఎన్నడూ లేనివిధంగా వ స్ర్తాలపై పన్ను పెంచడం దుర్మార్గమన్నారు. కరోనా కష్టకాలంలో వ్యాపారులు తీ వ్రంగా నష్టపోయారని, దీనికితోడు పన్ను పెంపుతో దుకాణాలు మూసే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్రం పునరాలోచన చేసి జీఎ్‌సటీనీ తగ్గించాలన్నారు. షాపులు మూసివేసి ర్యాలీ నిర్వహించారు. గణపతిరావు రోడ్డులో నిరసన ప్రదర్శన చేశారు. 

Updated Date - 2021-12-31T06:02:31+05:30 IST