శ్రీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు జాతీయస్థాయి గుర్తింపు
ABN , First Publish Date - 2021-11-28T06:02:36+05:30 IST
31వ డివిజన్ శ్రీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయస్థాయిలో ఉత్తమ సంక్షేమ సంఘంగా గుర్తింపు పొందింది.

శ్రీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు జాతీయస్థాయి గుర్తింపు
సత్యనారాయణపురం, నవంబరు 27: 31వ డివిజన్ శ్రీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయస్థాయిలో ఉత్తమ సంక్షేమ సంఘంగా గుర్తింపు పొందింది. జాతీయస్థాయిలో ఎంపిక కాబడిన కాలనీలలో రాష్ట్రానికి చెందిన ముత్యాలంపాడు లోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాటు విశాఖకు చెందిన తిరుమలనగర్ కాలనీ ఎంపికయ్యాయి. ఈనెల 23, 24 తేదీల్లో ఢిల్లోలోని ఘజియాబాద్‌లో జరిగిన 8వ జాతీయ సంక్షేమ సంఘాల కాన్ఫరెన్సులో శ్రీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఉత్తమ సంక్షేమ సంఘంగా పురస్కారం అందచేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కలిగినీడి గంగాధర రామారావు, ఆకెళ్ల మధు మురళీ, ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు అనిల్ అగర్వాల్, కల్నల్ టీపీ త్యాఘీ చేతుల మీదుగా అందుకున్నారు. జాతీయ స్థాయిలోపురస్కారం అందుకున్న అసోసియేషన్ సభ్యులను స్థానిక పెద్దలు అభినందించారు.