ఆలయాలకు శ్రావణ శుక్రవార శోభ

ABN , First Publish Date - 2021-08-21T05:51:59+05:30 IST

ఆలయాలకు శ్రావణ శుక్రవార శోభ

ఆలయాలకు శ్రావణ శుక్రవార శోభ
వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయంలో గాజుల అంలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవార్లు

ఉయ్యూరు, ఆగస్టు 20 : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం పురస్కరించుకుని ఉయ్యూరులో దేవాల యాలు మహిళా భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ వరలక్ష్మీవ్రతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరమ్మతల్లి, విష్ణాలయం, కనకదుర్గ ఆలయాల్లో  మహిళ లు ప్రత్యేక పూజలుచేసి అమ్మవారికి పసుపు కుంకుమ, నైవేథ్యం సమర్పించి సకల శుభాలు, సుఖసంతోషాలు కలుగజేయాలని కోరుకున్నారు. మహిళలతో ఆలయాల్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రత శోభ కన్పించింది.

గాజుల అలంకారంలో పేరంటాలమ్మ

   గుణదల : రామవరప్పాడు వెంకమ్మ పేరంటాలమ్మ శ్రావణ శుక్రవారం సందర్భంగా గాజుల అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు.  ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే  పేరంటా లమ్మను దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. మొక్కుబడి ఉన్న భక్తులు పొంగళ్లు చేసి అమ్మవారికి నైవేథ్యంగా సమర్పించారు.  చుట్టుపక్కల గ్రామాల నుంచి పేరంటాలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో  తరలివచ్చారు. 

లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో.. 

  గన్నవరం : పాత గన్నవరంలోని లక్ష్మీతిరుపతమ్మ ఆల యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వార్షిక సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాస్తి శేషగిరిరావు, వాణిశ్రీ దంపతులు అఖండ దీపారాధనతో సంబరాలను ప్రారంభించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణం లోని వేప మానుకు పూజలు నిర్వహించి అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పించారు. తిరుపతమ్మ మాతృ మండలి సభ్యులచే లలిత సహస్త్రనామ పారాయణం జరిపారు.  గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఉత్సవ మూర్తులతో భక్తులు ఆలయ ప్రదక్షణ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరిసర ప్రాంత భక్తులతో పాటు గ్రామ ప్రము ఖులు సంబరాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 

  ఉంగుటూరు మండలంలో..

 ఉంగుటూరు  : శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా మండలంలోని పలు శక్తి, శైవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పౌర్ణమికి ముందువచ్చే శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనంకోసం ఆయా ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తేలప్రోలులోని విశ్వేశ్వరస్వామి ఆలయం, ఇందుపల్లిలోని చంద్రశేఖర, చెన్నకేశవస్వామి ఆలయాల్లో ఈవో ప్రకృతాంబ పర్యవేక్షణలో నిర్వహించిన సహస్ర కుంకుమార్చన పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్కూరు లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త ముసునూరి శైలజ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు మోహన్‌కుమార్‌  వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకం, హారతి, గణపతిపూజలు నిర్వహించారు. కరోనా నిబంధనల మధ్య మహిళాభక్తులచేత గాజుల సమర్పణ, సామూహిక కుంకుమార్చనలు, వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. 

Updated Date - 2021-08-21T05:51:59+05:30 IST