ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
ABN , First Publish Date - 2021-08-25T06:41:41+05:30 IST
: సైబర్ నేరాల దర్యాప్తునకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ పోలీసు అధికారులకు సూచించారు.

మచిలీపట్నం టౌన్, ఆగస్టు 24 : సైబర్ నేరాల దర్యాప్తునకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులకు శిక్షణ తరగతులను సుల్తానగరం సుమ కన్వెన్షన్ హాలులో మంగళవారం ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు. విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అండ్రాయిడ్ ఫోన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయన్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. సైబర్ నేరాలను త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. విజయవాడ సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, సైబర్ నేరాల దర్యాప్తు విధానాన్ని వివరించారు. ఎఫ్‌ఎ్‌సఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ శివ ప్రసాద్ మాట్లాడుతూ, ఎలక్ర్టానిక్ పరికరాల ద్వారా ఆధారాలను సేకరించి ప్రయోగశాలకు పంపాలన్నారు. ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ నేరస్థలంలో ఆధారాలను ఏ విధంగా సేకరించాలో వివరించారు. ఐక్యూబ్ సొల్యూషన్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్ కరుణాకరరెడ్డి మొబైల్ సిగ్నల్‌ను ఏ విధంగా ట్రాక్ చేయాలో వివరించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీలు మసుంబాషా, ధర్మేంద్ర, మెహబూబ్ బాషా, సత్యానందం, శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి, మురళీకృష్ణ, రమేష్, రాజీవ్‌కుమార్, భరత్‌మాతాజీ, విజయకుమార్‌లతో పాటు సీఐలు అంకబాబు, బీమరాజు, రమేష్, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు పాల్గొన్నారు.