పిల్లలతో పనులు చేయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-05-20T06:23:26+05:30 IST

బడిఈడు పిల్లలతో పనులు చేయించటం చట్ట విరుద్ధమని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు బాబు పేర్కొన్నారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించి 33 మంది బాల కార్మికులను గుర్తించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

పిల్లలతో పనులు చేయిస్తే కఠిన చర్యలు

  ఆపరేషన్‌ ముస్కాన్‌లో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు హెచ్చరిక 

నందిగామ, మే 19 : బడిఈడు పిల్లలతో పనులు చేయించటం చట్ట విరుద్ధమని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు బాబు పేర్కొన్నారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించి 33 మంది బాల కార్మికులను గుర్తించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.  ప్రతి ఒక్కరూ పిల్లలను బడికి పంపాలని సూచించారు. కౌన్సెలింగ్‌ తరువాత కూడా తల్లిదండ్రులు పిల్లలను పనుల్లోకి పంపితే  కేసులు పెడతా మని హెచ్చరించారు.  చిన్నారులను కార్మిక శాఖ అధికా రులకు అప్పగిస్తున్నట్లు ఆయన తెలిపారు.  డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ కనకారావు, ఎస్సైలు, సిబ్బంది  పాల్గొన్నారు. 

కంచికచర్లలో

కంచికచర్ల రూరల్‌ :  ఆపరేషన్‌ ముస్కా భాగంగా బుధవారం కంచికచర్ల ఎస్‌ఐ-2 లక్ష్మీ ముగ్గురు బాలకార్మికులను గుర్తించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్పీ ఎదుట హాజరుపరిచారు.  పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపాలని చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేశారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సిబ్బం ది పాల్గొన్నారు.

నూజివీడులో 10 మంది గుర్తింపు

నూజివీడు రూరల్‌ : ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా నూజివీడు సర్కిల్‌ పరిధిలో 10 మంది బాలకార్మికులను గుర్తించినట్లు డిఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు.  పిల్లల తల్లిదండ్రులను పిలిపించి తహసీల్దార్‌ ఎం.సురే్‌షకుమార్‌, ఐసీడీఎస్‌ అధికారిణి జయలక్ష్మి, సీఐ వెంకటనారాయణ సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు.   చిన్నపిల్లలను పనులకు పంపినా, పనిలో పెట్టుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.  ఎస్సైలు గణే్‌షకుమార్‌, పండుదొర, రాజారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

 వత్సవాయిలో ఇద్దరు.. 

వత్సవాయి : ఆపరేషన్‌ ముస్కాన్‌లో బాగంగా మండలంలో ఇద్దరు బాల కార్మికులను గుర్తించినట్టు వత్సవాయి ఎస్సై మహాలక్ష్ముడు తెలిపారు.  పిల్లల తల్లిదండ్రులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చామని  వివరించారు. 

జగ్గయ్యపేటలో ఐదుగురు..

జగ్గయ్యపేట : పట్టణంలో ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ఐదుగురు బాలకార్మికులను గుర్తించినట్టు ఎస్సై-2 బి.వి. రామారావు చెప్పారు.  తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామని వివరించారు. 

Updated Date - 2021-05-20T06:23:26+05:30 IST