రక్తదానం చాలా గొప్పది : ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-29T06:39:21+05:30 IST

రక్తదానం అన్ని దానాల్లో కెల్లా గొప్పదని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసు కల్యాణ మండపంలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు.

రక్తదానం చాలా గొప్పది : ఎస్పీ

మచిలీపట్నం టౌన్‌ : రక్తదానం అన్ని దానాల్లో కెల్లా గొప్పదని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసు కల్యాణ మండపంలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్‌ అల్లాడ శ్రీనివాసరావు, డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ సాహితీ, డాక్టర్‌ ఫణికుమార్‌, డాక్టర్‌ రంగనాథ్‌, డాక్టర్‌ జయశ్రీ, ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ దర్మేంద్ర, మసూంబాషా, రాజ్‌కుమార్‌, విజయకుమార్‌, సీఐలు అంకబాబు, బీమరాజు, రాజే్‌ష  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T06:39:21+05:30 IST