మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
ABN , First Publish Date - 2021-02-27T06:08:28+05:30 IST
మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
పెనమలూరు, ఫిబ్రవరి 26 : యనమలకుదురు రామ లింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద త్వరలో జరు గనున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరిం చుకుని శుక్రవారం సెంట్రల్ జోన్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి సీఐ సత్య నారాయణతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. శివరాత్రి సమ యంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు ఉండం తో పోలీసు సిబ్బంది ఏర్పాటు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్ర మంలో ఈవో బి. గంగాధరరావు, అర్చకులు జీఆర్వీ సాగర్ పాల్గొన్నారు.