సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-08-25T06:42:00+05:30 IST

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్‌ తెలుగు సమాజం మరోసారి రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో సిం గపూర్‌లోని హెల్త్‌ సర్వీసెస్‌ అథారిటీ సింగపూర్‌ బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహిం చి దేశభక్తిని చాటుకున్నారు.

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

విజయవాడ కల్చరల్‌, ఆగస్టు 24 : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్‌ తెలుగు సమాజం మరోసారి రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో సిం గపూర్‌లోని హెల్త్‌ సర్వీసెస్‌ అథారిటీ సింగపూర్‌ బ్లడ్‌బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహిం చి దేశభక్తిని చాటుకున్నారు. స్థానికంగా నివసిస్తున్న తెలుగువారితో పాటు ఇతర దాతలూ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కరోనా విపత్తునూ వరుసగా ఐదోసారి విజయవంతంగా నిర్వహించటం విశేషం. అత్యద్భుత స్పందన వచ్చినా కొవిడ్‌ సురక్షిత చర్యల్లో భాగంగా ముందుగా నమోదు చేస్తుకున్న 100 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి కాలపరిమితి, నిబంధనలతో చాలామంది రక్తదానం చేయలేకపోయారు. తరువాత రోజుల్లో కూడా రక్తదానం చేయాలనుకునే దాతలు ఆర్‌వో 284 కోడ్‌ ఉపయోగిం చి రక్తదానం చేయాలని నిర్వాహకులు జూనెబోయిన అర్జునరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటం ప ట్ల సింగపూర్‌ తెలుగు సమాజానికి, రెడ్‌క్రాస్‌, బ్లడ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపా రు. కష్టకాలంలో ముందుకొచ్చి రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి, కార్యదర్శి సత్య చీర్ల కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-08-25T06:42:00+05:30 IST