గౌరీశంకరస్వామికి కేజీన్నర వెండి కమలం

ABN , First Publish Date - 2021-10-07T06:32:56+05:30 IST

స్థానిక గౌరీశంకరపురం శ్రీగౌరీశంకరస్వామి దేవస్థానా నికి భక్తులు కేజీన్నర బరువు ఉన్న వెండి కమలం గిన్నెను అందజేశారు.

గౌరీశంకరస్వామికి కేజీన్నర వెండి కమలం

గుడివాడ, అక్టోబరు 6 : స్థానిక గౌరీశంకరపురం శ్రీగౌరీశంకరస్వామి దేవస్థానా నికి భక్తులు కేజీన్నర బరువు ఉన్న వెండి కమలం గిన్నెను అందజేశారు. పామర్తి రాం బాబు, రాధ దంపతులు, లింగం సురే్‌షలాల్‌, సునీత దంప తులు, నాగ వెంకట గణపతి రవి కుమార్‌, నాగవెంకట సత్యసూర్య శ్రీ దంపతులు ఈ కమలం గిన్నెను అందజేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ బండారు శ్యామ్‌కుమార్‌, ఈవో కానూరి సురు్‌షభాబులకు వెండి గిన్నెను బుధవారం ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మూడెడ్ల ఉమా, వరుపుల బాలకృష్ణమూర్తి, లంకా సిరిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-07T06:32:56+05:30 IST