ఫ్యాషన్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఉపాధి మెండు

ABN , First Publish Date - 2021-12-07T06:17:19+05:30 IST

సిద్ధార్థ మహిళా కళాశాలలో సోమవారం ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలెప్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఉపాధి అవకాశాలు అనే అంశంపై సదస్సు జరిగింది.

ఫ్యాషన్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఉపాధి మెండు

ఫ్యాషన్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఉపాధి మెండు

లబ్బీపేట, డిసెంబరు6: సిద్ధార్థ మహిళా కళాశాలలో సోమవారం ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలెప్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఉపాధి అవకాశాలు అనే అంశంపై సదస్సు జరిగింది. సమనా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సడ్టీస్‌ డైరెక్టర్‌ సమనా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆరోగ్యం, ఆహారం, ఫ్యాషన్‌ అని, ఫ్యాషన్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగాలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ను ఇప్పుడు సరికొత్త వస్తూవులతో, బొమ్మలతో, గవ్వలతో ప్రత్యేకంగా చూపించవచ్చన్నారు. విద్యార్థులు ఈ రంగాన్ని ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి. విజయలక్ష్మి, డాక్టర్‌ ఎస్‌. కల్పన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T06:17:19+05:30 IST