ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

ABN , First Publish Date - 2021-09-02T05:58:19+05:30 IST

ప్రపంచ ప్రజల మధ్య ఆంగ్లం సంధాన భాషగా ఉందని సర్‌ సీవీరెడ్డి డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగ మాజీ విభాగాధిపతి ఎం.విన్సెంట్‌ పాల్‌ అన్నారు.

ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

వన్‌టౌన్‌, సెప్టెంబరు 1 : ప్రపంచ ప్రజల మధ్య ఆంగ్లం సంధాన భాషగా ఉందని సర్‌ సీవీరెడ్డి డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగ మాజీ విభాగాధిపతి ఎం.విన్సెంట్‌ పాల్‌ అన్నారు. ఆంగ్ల భాషపై మరింత పట్టు సాధించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆంగ్ల భాషా పఠనం, మాట్లాడే సామర్ధ్యాన్ని మెరుగుపరిచే వ్యుహాలు అంశంపై వెబినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను అనుసంధానించడంలో ఆంగ్లం కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఆంగ్ల భాషపై పట్టు కోసం తీసుకోవాల్సిన పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్‌ ఈ.వరప్రసాద్‌ మాట్లాడుతూ ఇటీవల ఆంగ్ల భాష ప్రాముఖ్యత మరింత పెరిగిందన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించిన విద్యార్థులకు త్వరగా ఉపాధి అవకాశాలు చేరువవుతాయన్నారు. అధ్యాపకులు డేవిడ్‌ దినకరన్‌, డాక్టర్‌ ఈజీ అనూరాధ, కళావతి, శాంతికుమారి, బీ మోహన్‌ తేజ, నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T05:58:19+05:30 IST