ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన తెనాలి శ్రవణ్

ABN , First Publish Date - 2021-02-06T18:07:42+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌తో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ శనివారం భేటీ అయ్యారు.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన తెనాలి శ్రవణ్

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌తో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ శనివారం భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో  సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాల్సిందిగా ఈ సందర్భంగా ఎస్ఈసీని శ్రవణ్ కోరారు. మన్నవ, జూపూడి, సీతారాంపురం,మాచవరం, మునిపల్లె, బ్రాహ్మణ కోడురు, దొప్పలపూడి గ్రామాలు సమస్యాత్మకమని..ఆయా గ్రామాల్లో అదనపు బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని శ్రవణ్  విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-02-06T18:07:42+05:30 IST