శాంతి, సహనంతో జీవించాలి

ABN , First Publish Date - 2021-12-26T06:29:03+05:30 IST

శాంతి, సహనంతో జీవించాలి

శాంతి, సహనంతో జీవించాలి
పెదఅవుటపల్లి బ్రదర్‌ జోసఫ్‌తంబి చర్చిలో దివ్యపూజాబలి సమర్పిస్తున్న ఫాదర్లు

 క్రిస్మస్‌ వేడుకల్లో టీడీపీ నేత బచ్చుల అర్జునుడు

హనుమాన్‌జంక్షన్‌, డిసెంబరు 25 :  ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధించిన శాంతి, సహనంతో జీవించాలని టీడీపీ గన్నవరం  ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు అన్నారు. టీడీపీ బాపులపాడు మండల అధ్యక్షుడు  దయాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సీఎస్‌ఐ చర్చిలో  క్రిస్మస్‌ వేడుకలు శనివారం ఘనంగా   నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  టీడీ పీ గన్నవరం  ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్‌ కట్‌ చేసి  క్రిస్మస్‌ శుభా కాంక్షలు తెలిపారు. చర్చి ఫాదర్‌ వరకుమార్‌ ప్రత్యే క  ప్రార్థనలు చేసి ఏసు క్రీస్తు సందేశాన్ని వివరిం చారు. ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడిని  దయా ల రాజేశ్వరరావు దుశ్శాలువతో సత్కరించి గౌరవిం చారు. కార్యక్రమంలో సీఎస్‌ఐ చర్చి ఉమెన్‌ ఫెలో షిప్‌ సెక్రటరీ దయాల విజయనిర్మల, టీడీపీ హనుమాన్‌జంక్షన్‌ పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీని వాసరావు, మండల తెలుగు రైతు అధ్యక్షుడు తు మ్మల జగన్‌,  వీరమాచనేని బుజ్జి పాల్గొన్నారు.

క్రీస్తు బోధనలు శిరోధార్యం :  దుట్టా 

యావత్‌ మానవాళికి ఏసు క్రీస్తు అందించిన  బోధనలు శిరోధార్యమని వైసీపీ పొలి టికల్‌ సలహా కమిటీ సభ్యులు దుట్టా రామచంద్రరావు అన్నారు. శనివారం తన గృహాంలో క్రిస్మస్‌ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు అందజేశారు. ప్రతి ఒక్కరు తోటి వారిపట్ల  ప్రేమపూర్వకంగా మెలగాలని  కోరారు కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు  కొమరవల్లి గంగాభవాని, వైసీపీనేత దుట్టా రవిశంకర్‌, బొమ్ములూరు సర్పంచ్‌ కాటూరు విజయభాస్కర్‌, కొమరవల్లి థామస్‌ తదితరులు పాల్గొన్నారు. 

విజయవాడ రూరల్‌లో

విజయవాడ రూరల్‌ : విజయవాడ రూరల్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలను శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పలు గ్రామాల్లోని భక్తులు శుక్రవారం రాత్రి నుంచే ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు పండుగను పురస్కరించుకుని ఇళ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నూతన దుస్తులు ధరించారు. నున్నలో సీఎస్‌ఐ, ఆర్‌సీఎం చర్చిలతోపాటు పలు ప్రైవేటు చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కరోనా, ఒమైక్రాన్‌ నేపథ్యంలో భక్తులంతా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలకు హాజరయ్యారు. నున్న, పాతపాడు, పీ నైనవరం, అంబాపురం, జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి తదితర గ్రామాల్లో క్రిస్మస్‌ వేడుకలు జరిగాయి. 

ఉయ్యూరులో..

   ఉయ్యూరు  : ఉయ్యూరు, మండల పరిధి గ్రామాల్లో శనివారం క్రిస్మస్‌ వేడుకను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చర్చిల్లో వేకువ జాము నుంచి  ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమ్మానుయేల్‌ చర్చిలో జరిగిన కార్యక్రమం లో డాక్టర్‌ జాన్‌డేవిడ్‌  ప్రార్థనలు చేసి  క్రీస్తు జననం మానవాళికి ఆయన చూపిన మార్గం వివరించారు. ప్రేమ, కరుణ, దయ యేసుక్రీస్తు చూపిన మార్గాలను అనుసరిం చాలన్నారు. ఈ సందర్భం గా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు  కుటుం బరాజు, రామసత్యకిషోర్‌ చర్చిలో భక్తులకు స్వీట్లు, బిస్కట్లు పంపిణీ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 

గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో..

ఉంగుటూరు : కరుణామయుడు, ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్‌ వేడుకలను గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని క్రైస్తవులందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చర్చిలు క్రైస్తవులతో కిటకిటలాడాయి. వేకువఝూము నుంచే ప్రారంభమైన ప్రత్యేకప్రార్ధనలు, గీతాలాపనలు, బైబిల్‌ బోధనలతో చర్చిలన్నీ మార్మోగాయి. పెదఅవుటపల్లిలోని దైవసేవకుడు బ్రదర్‌ జోసఫ్‌తంబి చర్చిలో క్షేత్రం రెక్టర్‌, రెవరెండ్‌ ఫాదర్‌ సుధాకర్‌ లారెన్స్‌, రెవరెండ్‌ ఫాదర్‌ మరియన్న నేతృత్వంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఫాదర్లు దివ్యపూజబలి సమర్పించి, క్రీస్తు జననం గురించి దైవసందేశాన్ని అందించారు. సంఘస్ధులు, విశ్వాసులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 

  వైభవంగా తేరు ఊరేగింపు

 మానికొండ ఆర్సీఎం చర్చిలో ఫాదర్లు సీహెచ్‌ సురేష్‌, సతీష్‌ల ఆధర్యంలో క్రీస్తుజన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫాదర్లు దివ్యపూజాబలి సమర్పించారు. అనంతరం భక్తునుద్దేశించి సందేశమిస్తూ మానవాళి పాపప్రక్షాళనకోసం ఏసుక్రీస్తు భూమిపై జన్మించాడని, తోటివారిపట్ల ప్రేమానురాగాలు కలిగివుండాలన్న క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని ఉద్భోదించారు. అనం తరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన తేరుపై తల్లి మరియమ్మ, బాలఏసుల స్వరూపాల్ని వుంచి స్తుతిగీతాలు ఆలపిస్తూ గ్రామపురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. గ్రామస్ధులు, సంఘస్థులు, విశ్వాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T06:29:03+05:30 IST