ప్రజారోగ్య భద్రతే ‘స్వచ్ఛ సంకల్పం’

ABN , First Publish Date - 2021-10-07T06:38:46+05:30 IST

గ్రామాల సంపూర్ణ పరిశుభత్ర, ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వచ్ఛ సంకల్పా నికి శ్రీకారం చుట్టారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు.

ప్రజారోగ్య భద్రతే ‘స్వచ్ఛ సంకల్పం’

పామర్రు, అక్టోబరు 6 : గ్రామాల సంపూర్ణ పరిశుభత్ర, ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వచ్ఛ సంకల్పా నికి శ్రీకారం చుట్టారని  రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. పామర్రు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బుధవారం స్వచ్ఛ సంకల్పం కింద జిల్లాకు కేటాయించిన 30 చెత్త తరలింపు వాహనాలను అన్ని నియోజక వర్గాలకు పంపిణితోపాటు 100 రోజుల స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానీలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో గడపాలన్నదే సీఎం జగన్‌ ప్రధాన లక్ష్యమన్నారు. క్లాప్‌ కార్యక్రమం నిర్వహణలో భాగంగా  డస్ట్‌బిన్‌లు ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు.  ప్రతి ఇంటా మూడు చొప్పన డస్ట్‌బిన్‌లను అందించడం కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 1500 పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ నిర్మిస్తామన్నారు. పామ ర్రు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే అనిల్‌కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌  నివాస్‌ మాట్లాడుతూ, జిల్లాలో జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో జడ్పీ సీఈవో సూర్యప్రకాష్‌, డీపీవో జ్యోతి, ఎమ్మెల్యేలు కొక్కిలగడ్డ రక్షణ నిధి, దూలం నాగేశ్వరరావు, సింహాద్రి రమేష్‌, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T06:38:46+05:30 IST