పంటలను కాపాడండి

ABN , First Publish Date - 2021-03-22T05:46:06+05:30 IST

జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో 16వ బ్రాంచ్‌ కెనాల్‌ కింద పంటలు సాగు చేసిన రైతులకు నీరందించాలని తెలంగాణా ఇరిగేషన్‌ అధికారులను

పంటలను కాపాడండి

 సాగర్‌ కెనాల్‌కు నీరు విడుదలపై 

తెలంగాణా అధికారులతో సామినేని సంప్రదింపులు

జగ్గయ్యపేట రూరల్‌, మార్చి 21: జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల పరిధిలో 16వ బ్రాంచ్‌ కెనాల్‌ కింద పంటలు సాగు చేసిన రైతులకు నీరందించాలని తెలంగాణా ఇరిగేషన్‌ అధికారులను కోరినట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు.  గండ్రాయి వద్ద బ్రాంచ్‌ కెనాల్‌ను ఆదివారం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పరిధిలో వరి, మిర్చి, మొక్కజొన్న, పసుపు పంటలు దాదాపు 40 వేల ఎకరాలు సాగర్‌ ఆయకట్టు కింద సాగు చేశామని తెలంగాణా నుంచి కాలవలో సరిగా నీరు రాకపోవటంతో తాము  నష్టపోయే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేయటంతో ఎమ్మెల్యే తెలంగాణా అధికారులను ఫోన్‌లో సంప్రదించారు. తక్షణమే నీరు విడుదల చేసి పొట్ట దశలో ఉన్న వరి, కంకి దశలోని మొక్కజొన్న, మిర్చి పంటలను కాపాడాలని కోరారు. డీఈ బానుబాబు, ఏఈలు భవానీ ఉషారాణి, గండ్రాయి, మల్కాపురం, చిన్నమోదుగపల్లి, మంగొల్లు, షేర్‌మహ్మద్‌పేట రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:46:06+05:30 IST