రైతులకు అండగా ఉంటాం..
ABN , First Publish Date - 2021-07-09T04:52:30+05:30 IST
రైతులకు అండగా ఉంటాం..

జిల్లాస్థాయి రైతు దినోత్సవంలో మంత్రి పేర్ని నాని
పెడన, జూలై 8 : రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెటింగ్ యార్డు ఆవరణలో గురువారం జిల్లాస్థాయి రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎమ్మెల్యే జోగి రమేశ్ అధ్యక్షత వహించారు. పేర్ని నాని మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం జిల్లాలో 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రైతులకు నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేయాలనే ఉద్దేశంతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆక్వా సాగు ఉన్న ప్రాంతాల్లో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ రైతుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ఈ సభలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు సలహాలు, సూచనలు ఇప్పించారు. తొలుత యార్డు ఆవరణలో రూ.70 లక్షలతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే జోగి రమేశ్, కలెక్టర్ నివాస్, మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రారంభించారు. వ్యవసాయ, మత్స్య, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఆర్డీవో ఖాజావలి, ఏఎంసీ చైర్మన్ గరికపాటి చారుమతి, మునిసిపల్ చైర్మన్ బళ్ల జ్యోత్స్నరాణి, వ్యవసాయ శాఖ జేడీ మోహనరావు, తహసీల్దార్ పి.మధుసూదనరావు, కమిషనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.