భౌతికదూరం ఏదీ?

ABN , First Publish Date - 2021-05-03T05:23:46+05:30 IST

భౌతికదూరం ఏదీ?

భౌతికదూరం ఏదీ?
రైతు బజారులో భౌతికదూరం మరిచిన వినియోగదారులు

 ఫ పట్టించుకోని రైతు బజారు అధికారులు

కంకిపాడు, మే 2 : కరోనా విజృంభిస్తున్నా ప్రజల్లో అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కరోనా మహమ్మారితో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా ప్రజల్లో కాస్తంత అవగాహన కూడా లేకపోవడం బాధాకరం. రైతు బజారులో కూరగాయాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు కనీసం  భౌతిక దూరం పాటించకపోవడం దురదృష్టకరం. ఒకరిపై ఒకరు పడుతూ వినియోగదారులు కూరగాయలు కొంటూ కనిపించారు. కరోనా ఉన్నా నాకేం కాదన్న మొండి వైఖరితో కొంత మంది ఇష్టానుసారం జనంలోకి వచ్చేస్తున్నారు. ఎవరికి కరోనా ఉందో.... ఎవరి లేదో కూడా తెలియని పరిస్థితి. అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు ఎక్కడా అప్రతమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించటం లేదు. ప్రజలు అప్రమత్తతోనే కరోనాను తరిమికొట్టవచ్చు అంటూ ప్రభుత్వ అధికారులు చెబుతున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు బజారు అధికారులు, సిబ్బంది కూడా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

Updated Date - 2021-05-03T05:23:46+05:30 IST