విజయవాడ జోన్‌ ఆర్టీసీ ఈడీగా ఆదాం సాహెబ్‌

ABN , First Publish Date - 2021-12-30T06:35:47+05:30 IST

విజయవాడ జోన్‌ ఆర్టీసీ ఈడీగా ఆదాం సాహెబ్‌

విజయవాడ జోన్‌ ఆర్టీసీ ఈడీగా ఆదాం సాహెబ్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కె.ఆదాం సాహెబ్‌ బుధవారం నియమితులయ్యారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్లకు ఆయన ఈడీగా వ్యవహరిస్తారు. ఆదాం సాహెబ్‌ ప్రస్తుతం ఏపీ నూర్‌బాషా/దూదేకుల ముస్లిం కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ నుంచి డిప్యూటేషన్‌పై ఆర్టీసీకి వచ్చారు. గతంలో ఆదాం సాహెబ్‌ ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో డీవీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఆర్టీసీ హెడ్డాఫీసులో సీపీఎంగానూ విధులు నిర్వర్తించారు. తర్వాత ఇక్కడి నుంచి డిప్యుటేషన్‌పై సొసైటీకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఆర్టీసీ విజయవాడ జోన్‌ ఈడీగా వచ్చారు. ఆదాం సాహెబ్‌కు మరో 8 నెలలే సర్వీసు ఉంది. వచ్చే సంవత్సరం ఆగస్టులో ఆయన పదవీ విరమణ చెందనున్నారు. 

Updated Date - 2021-12-30T06:35:47+05:30 IST