ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించండి

ABN , First Publish Date - 2021-10-29T06:36:40+05:30 IST

సచివాలయంలో శుక్రవారం నిర్వహించే జాయుంట్‌స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించి తగు న్యాయం జరిగేలా చూడాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలకు ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజ్ఞప్తి చేసింది.

ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించండి

ఏపీపీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 

వన్‌టౌన్‌, అక్టోబరు 28 : సచివాలయంలో శుక్రవారం నిర్వహించే జాయుంట్‌స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించి తగు న్యాయం జరిగేలా చూడాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలకు ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదరరావు పత్రికా ప్రకటన చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసినా ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే అన్ని రాయితీలు వర్తింపచేయడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపచేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న వేతనాలు, ఇతర అలవెన్సుల తేడాను 11వ పీఆర్‌సీలో సవరించేలా చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. 1800 మందికి కారుణ్య నియామకాలు, మెడికల్‌గా అన్‌ఫిట్‌ అయిన 180 మందికి ఏదో ఒక ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు ఇచ్చేలా చూడాలన్నారు. ఉద్యోగులను హెల్త్‌స్కీం నుంచి మినహాయించి పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. సుమారు 48వేల మంది ఉద్యోగులకు ఐడీ యాక్ట్‌ వర్తింపజేసి కోడ్‌ ఆఫ్‌ డిసిప్లైన్‌ను అమలు చేయాలన్నారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ చీఫ్‌ సెక్రటరీకి రాసిన లేఖను జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుకు అందచేశారు.

Updated Date - 2021-10-29T06:36:40+05:30 IST