విస్సన్నపేట వయా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2021-11-21T06:27:14+05:30 IST
విస్సన్నపేట వయా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్సు

వన్‌టౌన్, నవంబరు 20: ప్రయాణికుల సౌకర్యం కోసం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా విస్సన్నపేటకు ఆర్టీసీ బస్పు సదుపాయాన్ని కల్పించినట్లు డిపో మేనేజర్ హెచ్‌ఎస్‌ఎస్‌సీహెచ్ పి.శర్మ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జి.కొండూరు, మైలవరం, చీమలపాడు, కుదుప, మాధవరం, కూనపరాజుపర్వల మీదుగా బస్సును శనివారం నుంచి నడుపుతున్నట్టు తెలిపారు. 44వ నెంబరు ప్లాట్‌ఫారం నుంచి బస్సు బయలుదేరుతుందని, సిటీ పోర్ట్, కాళేశ్వరరావు మార్కెట్, కెనాల్ పాయింట్, కుమ్మరిపాలెం, స్వాతి థియేటర్ మీదుగా రూట్‌ను మార్చినట్లు తెలిపారు.